జాతీయ ఫుట్‌బాల్‌కు రంపచోడవరం బాలికలు
ASR: రంపచోడవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు చంద్రకళ, అగ్నిహోత్రి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఖేలో ఇండియా ట్రైబల్ మీట్‌లో రాష్ట్రం తరఫున పాల్గొనడానికి మంగళవారం ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్లారు. ఇటీవల కేరళలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.