అక్రమ మట్టి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు

BDK: పాల్వంచ మండలం రంగాపురం కిన్నెరసాని వాగు బ్రిడ్జి సమీపంలో అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తున్న వారిని రెవెన్యూ అధికారులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. ఓ మామిడి తోట సమీపంలో JCB సహాయంతో పది ట్రాక్టర్లు అక్రమ మట్టి తొలకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాచారంతో వారిని అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు.