ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

MNCL: జిల్లాలో వరి సాగు చేసిన రైతుల ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. శనివారం తనకు సెలవు దినం అయినప్పటికీ హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తూకం వేసిన బస్తాలు ఎక్కువ ఉన్న కేంద్రాలకు లారీలను తెప్పించి లోడింగ్ చేయించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.