ఏటూరునాగారంలో మహిళపై హత్యాయత్నం

ఏటూరునాగారంలో మహిళపై హత్యాయత్నం

MLG: ఓ మహిళపై హత్యాయత్నం ఘటన ఏటూరునాగారంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. శివాలయం వీధికి చెందిన తోకల లక్ష్మీ అనే మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇటుకరాయితో తలపై దాడి చేసినట్లు తెలిపారు. అప్రమత్తమైన కుటుంబీకులు కేకలు వేయడంతో పారిపోయారన్నారు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.