శానిటేషన్ వర్కర్లకు శిక్షణ
VSP: భీమిలిలోని 8వ వార్డు డా.బి.ఆర్. అంబేద్కర్ కళ్యాణ మండపంలో శానిటేషన్ వర్కర్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ శిక్షణలో స్టేట్ స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు బుచ్చ రామురెడ్డి, ఎం. నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ మేరకు శానిటరీ వర్కర్లు పాటించాల్సిన విధి విధానాలపై అవగాహన కల్పించారు.