'బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలి'

'బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలి'

KMM: అసెంబ్లీ ఆమోదించిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ లో 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, లేకపోతే బీసీ వ్యతిరేకిగా BJP చరిత్రలో నిలిచిపోతుందని CPM డివిజన్ కార్యదర్శి బండి రమేష్ అన్నారు. ఇవాళ ఖమ్మం రూరల్ మండలం తమ్మినేని సుబ్బయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ వైఖరిని తెలంగాణ ప్రజలు ఎండగట్టాలని చెప్పారు.