సంగెంలో రోడ్డు భద్రతపై ఎస్సై ప్రత్యేక దృష్టి
WGL: సంగెం మండల కేంద్రంలో పరిసర గ్రామాల ప్రధాన రహదారులపై ప్రయాణీకుల భద్రత కోసం ఎస్సై వంశీకృష్ణ ఆదివారం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్సై రోడ్డుమలుపుల వద్ద అడ్డంకిగా ఉన్న కొమ్మలు, పొదలను జేసీబీలు, కూలీల సహాయంతో తొలగింపజేశారు.