ఆదోని పట్టణంలో హోలీ వేడుకలు
KRNL: ఆదోని పట్టణంలో హోలీ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. వాడవాడల చిన్నాపెద్ద రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగితేలారు. హౌసింగ్ బోర్డ్, లంగర్ బావి వీధి, రాజరాజేశ్వరి నగర్, హనుమాన్ నగర్ మేదర వీధి తదితర ప్రాంతాల్లో డ్రమ్ముల్లో రంగు నీళ్లు తయారు చేసుకొని వచ్చి పోయే వారిపై నీళ్లు చల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణమంతా డీజే నృత్యాలతో హోరెత్తించారు.