పోర్టుల ఆధునికరణకు సింగపూర్ పర్యటన దోహదం

పోర్టుల ఆధునికరణకు సింగపూర్ పర్యటన దోహదం

AKP: ఏపీలో పోర్టులు ఆధునికరణకు సింగపూర్ పర్యటన దోహదపడుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మూడవరోజు టువాస్ పోర్టును సహచర మంత్రులతో కలసి సందర్శించినట్లు మంత్రి 'X'లో పేర్కొన్నారు. ఈ పోర్టులో డ్రైవర్లు లేని ఎలక్ట్రిక్ వాహనాలు, రిమోట్ కంట్రోల్ క్రేన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లాజిస్టిక్ వ్యవస్థలు, గ్రీన్ పోర్ట్ విధానాలను పరిశీలించామన్నారు.