ఆర్టీసీ కార్మికులపై దాడిచేస్తే కఠిన చర్యలు: నాగిరెడ్డి

ఆర్టీసీ కార్మికులపై దాడిచేస్తే కఠిన చర్యలు: నాగిరెడ్డి

HYD: విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడులకు పాల్పడటం సహించరాని నేరమని ఆర్టీసీ సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి హెచ్చరించారు. కార్మికులపై దాడులు చేసే వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంస్థ పరంగా కార్మికులకు పూర్తి భద్రత, భరోసా ఉంటుందని నాగిరెడ్డి హామీ ఇచ్చారు.