రేపు కొలిమిగుండ్లలో ఉపాధి సామాజిక తనిఖీ సభ

రేపు కొలిమిగుండ్లలో ఉపాధి సామాజిక తనిఖీ సభ

NDL: కొలిమిగుండ్ల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉపాధి పనుల సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో దస్తగిరి బాబు ఇవాళ వెల్లడించారు. 2024-25 మధ్యకాలంలో జరిగిన పనులకు సంబంధించి గ్రామస్థాయి తనిఖీ ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఉపాధి పనులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రజలు రైతులు ఈ సభ దృష్టికి తీసుకురావచ్చు అని ఆయన సూచించారు.