మండలంలో తపస్- 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
VKB: బొంరాస్‌పేట మండలంలో తపస్- 2026 నూతన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లీగల్ సలహాదారు విజయవర్ధన్, సర్పంచ్ వీరేశం, జిల్లా అధ్యక్షులు బి. మల్లయ్య, మహిళా అధ్యక్షురాలు శ్రీప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవర్ధన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పట్ల తన సహకారం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.