బొల్లారం మున్సిపాలిటీలో దోమల నివారణకు ఫాగింగ్
SRD: బొల్లారం మున్సిపాలిటీలోని 19వ, వార్డ్ పోచమ్మ బస్తీలో కమిషనర్ కిషన్ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలను శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులతో ఫాగింగ్ చేయించారు. దోమలు వృద్ధి చెందకుండా కాలనీవాసులు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.