సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: కరకగూడెం (M) రేగళ్ల గ్రామ పంచాయతీలో రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గత పది ఏళ్లలో ఎవరు ఇవ్వని రేషన్ కార్డులు ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే అర్హులైన అందరికీ పంచిందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే అర్హులైన వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తూ పేదవారి సొంతింటి కల నెరవేర్చిందని అన్నారు.