అంధుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
GNTR: గుంటూరు నగరంలోని అరండల్‌పేట పిచ్చుకలగుంట గ్రౌండ్‌లో విభిన్న ప్రతిభావంతుల (అంధుల) క్రికెట్ టోర్నమెంట్‌ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంధుల కోసం ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందకరమని, సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.