VIDEO: ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం: కలెక్టర్
WNP: దేశంలో అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్ప తనమేనని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి కలెక్టరెట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీతతో కలిసి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయించారు.