నాటు సారా బట్టీపై మెరుపు దాడి

నాటు సారా బట్టీపై మెరుపు దాడి

ASR: చింతపల్లి మండలం కొర్రుబయలు గ్రామ శివారులో ఎక్సైజ్ సిబ్బంది బుధవారం మెరుపు దాడి నిర్వహించి అక్రమ సారా బట్టీని ధ్వంసం చేశారు. ఈ దాడిలో లమ్మసింగి గ్రామానికి చెందిన పోలోజు దేముడు (39)ను పట్టుకుని, అతని వద్ద నుండి 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.