VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ప్రకాశం: మార్కాపురం పట్టణంలో 30వ వార్డులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి స్థానిక ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు మార్కాపురం జిల్లా ప్రకటిస్తామని ఇచ్చిన మాట ప్రకారం సీఎం జిల్లా ఏర్పాటు చేయడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.