VIDEO: భక్తిశ్రద్ధలతో శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవ వేడుకలు
ATP: గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామిని రథంపై కొలువు తీర్చి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయం వద్ద చెన్నకేశవ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.