రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

KNR: సైదాపూర్ మండలంలోని ఆకునూర్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బొడిగె లహరి, మండల ప్రగతి, పెద్ది సాత్వికలు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 15న కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి ఎంపిక పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.