గాంధీభవన్‌లో NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
HYD: NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి ఆధ్వర్యంలో NSUI 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గాంధీభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై NSUI జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.