బిక్షాటన చేసిన ఎస్ఎఫ్ఎ నాయకులు
KMR: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని శనివారం ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షుడు అరుణ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కామారెడ్డిలో బిక్షాటన చేశారు. వేలాది మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల కారణంగా చదువును కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.