ధాన్యం రాశుల చుట్టూ వర్షం నీరు

ELR: ఉంగుటూరు మండలంలో ఆదివారం భారీ వర్షానికి పలు గ్రామాల్లో ధాన్యం రాశులు చుట్టూ వర్షం నీరు చేరింది. మెట్ట ప్రాంతంలో కొత్తగూడెం, తిమ్మయ్యపాలెం, డెల్టా గ్రామాలు కాగుపాడు, దొంతవరం, పొట్టిపాడు, తోటరామచంద్రపురం ఇతర గ్రామాల్లో ధాన్యం రాశులు చుట్టూ వర్షం నీరు చేరింది. ఆ నీటిని బయటకు తీసేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.