VIDEO: ట్రాక్టర్ బోల్తా పలువురికి గాయాలు

MLG: మంగపేట మండలం శనగకుంట శివారులో శనివారం ట్రాక్టర్ బోల్తా పడి 12 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. నరసింహసాగర్ నుంచి శనగకుంట గ్రామానికి వరి పొలంలో నాట్లు వేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.