అంగన్వాడీ ప్రీ స్కూల్ గురించి అవగాహన కార్యక్రమం

అంగన్వాడీ ప్రీ స్కూల్ గురించి అవగాహన కార్యక్రమం

ELR: ఆట, పాటల సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రాలలో ఉంటాయని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. సోమవారం ఉంగుటూరులోని అంగన్వాడీ ప్రీ స్కూల్ గురించి పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు. పిల్లలకు చదువుతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు.