VIDEO: 'ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఇస్తాం'
ప్రకాశం: మార్కాపురంలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ తరఫున మృతుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. ఆయన వెంట అన్నా రాంబాబు ఉన్నారు.