VIDEO: శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మంత్రి, మాజీ గవర్నర్

VIDEO: శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మంత్రి, మాజీ గవర్నర్

TPT: తమిళనాడు చేనేత, టెక్‌స్టైల్స్ శాఖ మంత్రి ఆర్. గాంధీ, మాజీ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.