‘26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్లతో దాడి’

భారత సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ తెలిపారు. భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసిందని.. అర్థరాత్రి 1:40 గంటల తర్వాత దాడులను తీవ్రతరం చేసిందని వెల్లడించారు. సామాన్య పౌరులకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగేలా చూసుకుంటూ పాక్‌పై దాడులు చేశామని ఆయన స్పష్టం చేశారు.