తప్పిపోయిన బ్యాగు అప్పగింత
NLG: నల్గొండ క్లాక్ టవర్ వద్ద ఆటోలో మర్చిపోయిన విలువైన బ్యాగును టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే బాధితుడికి అప్పగించారు. బాతుల పెంపకందారు దాసరి రాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వై. సైదులు బృందం సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించింది. సిబ్బంది కొరత ఉన్నా పోలీసులు వేగంగా స్పందించి బ్యాగును సురక్షితంగా అందజేశారు. పోలీసుల అంకితభావం పట్ల రాజు హర్షం వ్యక్తంచేశారు.