సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
WGL: వర్ధన్నపేట పట్టణంలోని పుస్కస్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సైబర్‌క్రైమ్, మాదక ద్రవ్యాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ అంబటి నరసయ్య హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.