తిరుపతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
TPT: ఏపీ హంస ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో మరింత రాణించాలని పేర్కొన్నారు. విద్యతోనే మహిళల సాధికారత సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.