వరద సమస్య నివారణకు చర్యలు
SRD: హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలోని వడ్డెర కాలనీలో గృహాల మధ్య చేరుతున్న వరద నీటిని నివారించేందుకు సర్పంచ్ తోడేటి రమేష్ చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద కుమ్మరి కుంట కాలువలో ప్రవాహానికి అడ్డుగా పేరుకుపోయిన కలుపు మొక్కలను తొలగించే పనులు ప్రారంభించారు. ఈ చర్యలతో కాలువలో నీటి ప్రవాహం సాఫీగా జరిగి, కాలనీలోకి వరద నీరు చేరకుండా నివారించవచ్చని అన్నారు.