బాలబ్రహ్మేశ్వర ఆలయ ఈవోపై కేసు నమోదు

బాలబ్రహ్మేశ్వర ఆలయ ఈవోపై కేసు నమోదు

GDWL: అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో దీప్తిపై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ​కూరగాయల టెండర్ రద్దు చేయడంతో మనస్థాపానికి గురైన టెండర్‌దారు శ్రీలత (ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి), ప్రజా సంఘాల నాయకులతో కలిసి అలంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈవోపై శనివారం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.