12 సిక్సర్లతో రీచా ఘోష్ ప్రపంచ రికార్డ్
టీమిండియా వికెట్ కీపర్ రీచా ఘోష్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధికంగా 12 సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్‌కు చెందిన డియాండ్రా డాటిన్, సౌతాఫ్రికాకు చెందిన లిజెల్ లీ పేరిట ఉండగా, ప్రస్తుతం రీచా ఘోష్ వీరితో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.