కుక్కల దాడిలో 6మేక పిల్లలు మృతి

కుక్కల దాడిలో 6మేక పిల్లలు మృతి

SKLM: వీధి కుక్కలు దాడి చేయడంతో ఆరు మేక పిల్లలు మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పాతపట్నం మండలంలోని తామాడ గ్రామానికి చెందిన పాసి రాముకు చెందిన తొమ్మిది మేక పిల్లలుపై కుక్కలు దాడి చేయడంతో ఆరు మేక పిల్లలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరో మూడు మేక పిల్లలను తీవ్రంగా కుక్కలు గాయపరిచాయి. సుమారు రూ.60వేలు నష్టం వాటిల్లిందని తనకు జీవనాధారం కోల్పోయాని యజమాని రాము వాపోయాడు.