ఏ.కొండూరు ఘటనపై ప్రిన్సిపల్, వార్డెన్లకు షోకాజ్ నోటీసులు
NTR: ఎం.కొండూరులోని KGBVలో 12 మంది విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై కలెక్టర్ లక్ష్మీశ స్పందించారు. పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనకు గల కారణాలను వెంటనే వివరించాలని ఆదేశించారు. KGBV కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని పంపాలని కలెక్టర్ సూచించారు.