జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్ష పదవి ఎవరిని వరించేనో..?

జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్ష పదవి ఎవరిని వరించేనో..?

కోనసీమ: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు బరిలో ఉన్నారు. కొత్త జిల్లాలో పార్టీ బలం పెంపు దిశగా సరైన నేతకు అధిష్ఠానం అవకాశం కల్పించాలని నాయకులు ఎదురుచూస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం దరఖాస్తు చేసిన అభ్యర్థులపై సమగ్ర సర్వే నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.