మత్సకారుడికి చిక్కిన 28 కిలోల భారీ చేప

KNR: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామం మోయ తుమ్మెద వాగు (మానేరు జలాశయం)లో ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన తిరుపతి అనే మత్స్యకారుడికి 28 కిలోల బొచ్చే చేప వలకు చిక్కింది. చాలా సంవత్సరాల నుంచి చేపలు పడుతూన్నా ఎప్పుడు ఇంత పెద్ద చేప వలకు చిక్కలేదని, వినాయక నిమ్మజనం రోజున ఇంత పెద్ద చేప చిక్కడం చాలా సంతోషగా ఉందని తిరుపతి అంటున్నాడు.