వెదురు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఛైర్మన్
MNCL: వెదురు ఉత్పత్తులు, వస్తువుల తయారీలో శిక్షణ పొందిన గిరిజనులు ఆర్థిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. సోమవారం జన్నారం మండలంలోని ఇందన్ పల్లి అనుబంధ నాయకపు గూడాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వెదురు ఉత్పత్తులు శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.