VIDEO: తిరుమలలో జోరుగా సాగుతున్న చిత్రలేఖన పనులు

TPT: 2025 బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. వెంకటేశ్వరుని పవిత్ర నివాసానికి దివ్య సౌందర్యాన్ని చేకూర్చేలా పవిత్ర చిత్రలేఖన పనులు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజులపాటు అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.