కిలో చికెన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ

VZM:గంట్యాడ మండలంలోని బహిరంగ మార్కెట్లో ఆదివారం కిలో చికెన్ ధర 200 రూపాయలు పలుకుతుండగా కోటారబిల్లి జంక్షన్‌లో చికెన్ విక్రయ దుకాణదారులు మాత్రం వారి మధ్య పోటీ కారణంగా బహిరంగ మార్కెట్ కంటే ధర తగ్గించి కిలో చికెన్ 160 రూపాయలకే విక్రయిస్తున్నారు. వీరిలో ఒక దుకాణదారుడు మరో ముందడుగు వేసి కిలో చికెన్ కొంటె అరకిలో ఉల్లిపాయలు ఫ్రీ అంటూ బోర్డు పెట్టారు.