కొండ చిలువను హతమార్చిన గ్రామస్తులు
Srcl: కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో మంగళవారం రాత్రి కొండచిలువ కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి గ్రామంలోని గల అంగన్వాడీ సెంటర్ ఆవరణలోకి కొండ చిలువను రావడం స్థానికులు గమనించారు. దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు కొండచిలువను కొట్టి హతమార్చారు.