మేడే సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ

MBNR: ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా అచ్చంపేట పట్టణ పరిధిలోని బోల్గెట్ పల్లి గ్రామ సమీపంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఐఎన్టీయుసీ సంఘం ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, అచ్చంపేట టౌన్ అధ్యక్షులు గౌస్ పాష, కార్యదర్శి వెంకటేష్, స్వామి గౌడ్, రాజు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.