పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
PLD: ఎడ్లపాడు మండలం దింతనపాడులో పేకాట ఆడుతున్న ఆరుగురిని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శివరామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తమకు వచ్చిన సమాచారం ఆధారంగా జూదం ఆడుతున్న స్థావరంపై దాడి చేసి వారి వద్ద నుంచి రూ.5200 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు.