రౌతులపూడిలో సర్పంచులకు సన్మాన కార్యక్రమం
KKD: రౌతులపూడి మండల కేంద్రంలో గ్రామ సర్పంచుల సన్మాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ ముద్రగడ గిరిబాబు పాల్గొని మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. గ్రామ పరిధిలో సర్పంచులు అందించిన సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సత్కారం నిర్వహించామన్నారు.