'ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలి'
SGR: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీని ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేకే భవన్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.