'రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇస్తున్నాం'

HYD: రికార్డు స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తోందని హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సచివాలయంలో నూతనంగా నియామకమైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్‌కి నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 132 మందికి నియామకపత్రాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. ఉద్యోగాలు సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.