'రాష్ట్రాన్ని అందించిన ఆమె సేవ మరువలేనిది'
RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నేతలు, నందిగామ మాజీ సర్పంచ్ కొమ్ము కృష్ణ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో అపూర్వమైన ధైర్యం, ప్రజాసేవ పట్ల అచంచల అంకితభావంతో కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించారన్నారు. ప్రజల ఆశయాలను గౌరవించి రాష్ట్రాన్ని అందించిన ఆమె సేవ మరువలేనిదన్నారు.