ఆత్మకూరులో నిర్వహించిన సీపీఎం సమావేశం
NDL: ఆత్మకూరు పట్టణంలో సీపీఎం పార్టీ నాయకులు నాగేశ్వరరావు అధ్యక్షతన ఇవాళ సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని జిల్లా రోడ్డు నుంచి దుద్యాల రోడ్డు వరకు ఉన్నపెద్ద వాగులో పూడికతీత పనులు చేపట్టాలని సీపీఎం నాయకులు రణధీర్ అన్నారు. వాగులో పూడికతీత పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఎం నాయకులు పేర్కొన్నారు.