బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ప్రియాంక అల

KMM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనీలో భాగంగా గురువారం పాల్వంచ మండలంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బడిబాట ప్రారంభోత్సవ ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.